Monday, January 20, 2025

దంపతుల మధ్య గొడవలు…. సిఐ భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: దంపతుల మధ్య కలహాలు చెలరేగడంతో సిఐడి సిఐ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడ పటమట తోటవారి వీధిలో సిఐడి సిఐ చంద్ర శేఖర్ కుటుంబం నివసిస్తుంది. చంద్ర శేఖర్-జ్యోతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పిల్లలకు భోజనం పెడుతుండగా ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ జరిగిన వెంటనే చంద్రశేఖర్ ఇంటికి నుంచి బయటకు వెళ్లాడు. తీవ్ర మనస్థాపం చెందిన జ్యోతి ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుంది. పిల్లలు ఎంత కొట్టిన గడియ తీయకపోవడంతో తండ్రి ఫోన్ చేశారు. చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా అప్పటికే జ్యోతి ఉరేసుకొని కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రశేఖర్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News