- Advertisement -
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సిఐడి కేసు నమోదైంది. భారత పౌరసత్వం లేకుండానే ఆయన ఎన్నికల్లో పోటీ చేశారని.. ఎన్నికల సమయంలో తప్పుడు పత్రాలు చూపించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిజిపికి ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నమనేనిపై తెలంగాణ సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు వివరాలను అందించాలని సిఐడి పిలుపునిచ్చింది. దీంతో కేసు వివరాలను అందించేందుకు ఆది శ్రీనివాస్ సిఐడి ఎదుట హాజరుకానున్నారు.
- Advertisement -