Monday, December 23, 2024

ఎపి ఎక్సైజ్ కార్యాలయంలో కొనసాగుతున్న సిఐడి సోదాలు

- Advertisement -
- Advertisement -

ఎపి ఎక్సైజ్ కార్యాలయంలో సిఐడి తనిఖీలు నిర్వహిస్తుంది. కార్యాలయంలో కంప్యూటర్లు ఓపెన్ చేయించి సిఐడి అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి సిఐడి విస్తృత తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంతో పాటు మరికొన్ని జిల్లాల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తుంది. కీలక సమాచారం కోసం ఎపి బెవరేజస్ కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే ఎపి బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి నివాసంలో తనిఖీలు చేసిన సిఐడి అధికారులు హైదరాబాద్, తాడేపల్లిలోని నివాసాల్లో సోదాలు చేసి కీలక సమాచారం సేకరించినట్లు సీఐడీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రికార్డులు అక్రమంగా తరలించారని వాసుదేవరెడ్డిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News