హైదరాబాద్: మార్గదర్శి అక్రమాలపై సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో మార్గదర్శి బ్రాంచ్‌ల్లో సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం, నరసరావు పేట, ఏలూరు, అనంతపురం మార్గదర్శి బ్రాంచ్‌ల్లో సిఐడి అధికారులు సోదాలు చేపట్టారు. మార్గదర్శి రశీదు డిపాజట్ల ముసుగులో భారీగా బ్లాక్‌మనీగా మార్పిడి చేసుకున్నారు. ఆ నల్లధనాన్నే తమ సంస్థల్లో రామోజీ రావు పెట్టుబడులుగా తరలించారు. చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. రికార్డులు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను సిఐడి అధికారులు పరిశీలించారు. చిట్‌ఫండ్ అక్రమాలు, నిధులు దారి మళ్లింపుపై సిఐడి విచారణ చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ మార్గదర్శి కార్యాలయంలో సిఐడి సోదాలు చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి అక్రమాల కేసులో ఎ1గా రామోజీ రావు, ఎ2గా ఎండిశైలజా కిరణ్‌ను ఉంచారు.
Also Read: 180 ఎకరాల భూములను కొట్టేసిన మంత్రి జయరామ్: లోకేష్