Saturday, September 28, 2024

పోక్సో కేసులో ఎడియూరప్పకు సిఐడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నమోదైన పోక్సో కేసులో దర్యాప్తు కోసం తమ ఎదుట హాజరుకావాలని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ ఎడియూరప్పకు కర్నాటక సిఐడి నోటీసు జారీచేసింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎడియూరప్ప తిరిగి వచ్చిన తర్వాత దర్యాప్తు బృందం ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఎడియూరప్పను ఆయన నివాసంలో కలసినపుడు తన 17 ఏళ్ల కుమార్తెపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక 54 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చి 14న సదాశివనరగ్ పోలీసు స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు కాగా వెంటనే ఈ కేసును సిఐఇడికి బదిలీ చేస్తూ కర్నాటక డిజిపి అలోక్ మోహన్ ఉత్తర్వులు జారీచేశారు.

ఎడియూరప్పపై ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. తనపై వచ్చిన ఆరోపణలను 81 ఏళ్ల ఎడియూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు. బుధవారం తమ ఎదుట హాజరుకావాలని సిఐడి మంగళవారం ఎడియూరప్పకు నోటీసు పంపగా ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండడంతో మరికొంత వ్యవధి కావాలని ఆయన కోరారు. మూడు రోజుల తర్వాత ఎడియూరప్ప సిఐడి ఎదుట హాజరవుతారని వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పోలీసులు బాధితురాలితోపాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News