Monday, December 23, 2024

టిడిపికి సిఐడి నోటీసులు జారీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఐడి తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న టిడిపి నేత అశోక్ బాబుకు ఈ నోటీసులు అందచేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి రూ. 27 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది.

ఈ నెల 18వ తేదీన మంగళగిరి సిఐడి కార్యాలయానికి వచ్చి రూ. 27 కోట్లకు సంబంధించిన వివరాలను అందచేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఎపి స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో పెద్దయెత్తున నగదు చేతులు మారిందని సిఐడి ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇదే కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు జైల్లో ఉండి అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి విదితమే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News