Thursday, January 23, 2025

ఎపి ఎంపి రఘురామకు సిఐడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

AP CID police goes to raghurama krishnam raju

మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని బుధవారం నాడు ఎపి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. గతంలో రఘురామను విచారించిన సిఐడి , ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి సిఐడి పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు. గతంలో సీఐడీ విచారణ, అరెస్ట్‌పై పెద్ద వివాదమే నడిచింది.. ఆయన పాదాలపై మరకల వ్యవహారం చర్చగా మారింది.. ఈ వ్యవహారంలో రఘురామ సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News