Monday, December 23, 2024

రెండో రోజు చంద్రబాబును విచారించనున్న సిఐడి అధికారులు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: రెండో రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విచారించేందుకు సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. తొలి రోజు స్కిల్ స్కామ్‌ కేసులో రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును సుమారు ఆరు గంటలపాటు సిఐడి డిఎస్‌పి ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది బృందం విచారించింది.

బాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ జరిగింది. రెండు రోజుల విచారణ నేటితో ముగియనుంది. కాగా, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News