Wednesday, January 22, 2025

ఎడియూరప్ప చార్జిషీట్‌లో సిఐడి సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ ఎడియూరప్పపై దాఖలైన కేసును దర్యాప్తు చేస్తున్న కర్నాటక సిఐడి కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సంచలన విషయాలను వెల్లడించింది. బాధితురాలు, ఆమె తల్లి నోళ్లు మూయించడానికి ఎడియూరప్ప, ఆయన సహాయకులు డబ్బు ముట్టచెప్పారని సిఐడి తన చార్జిషీట్‌లో ఆరోపించింది. 81 ఏళ్ల ఎడియూరప్పపై పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. ఈ కేసులోని మరో ముగ్గురు నిందితులు, ఎడియూరప్ప సహాయకులైన వైఎం అరుణ్, ఎం రుద్రేష్, జి మారిస్వామిపైన ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా..పోక్సో కేసులకు సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో గురువారం సిఐడి చార్జిషీట్ దాఖలు చేసింది.

చార్జిషీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఉదయం 11.15 ప్రాంతంలో 54 ఏళ్ల ఒక మహిళ తన 17 ఏళ్ల కుమార్తెతో కలసి బెంగళూరులోని డాలర్స్ రోడ్డులో ఉన్న ఎడియూరప్ప నివాసానికి వెళ్లింది. గతంలో తన కుమార్తెపై జరిగిన లైంగిక దాడి కేసులో న్యాయం కోరేందుకు ఆమె ఎడియూరప్ప నివాసానికి వెళ్లింది. ఆ మహిళతో మాట్లాడుతున్నంత సేపు ఎడియూరప్ప తన ఎడమ చేతితో ఆ మైనర్ బాలిక కుడి మణికట్టును పట్టుకునే ఉన్నారు. అనంతరం హాలుకు ఆనుకుని ఉన్న మీటింగ్ రూములోకి ఆ బాలికను తీసుకుని వెళ్లిన ఎడియూరప్ప తలుపు గొళ్లెం పెట్టారు. గతంలో తనపైన అఐంగిక దాడి చేసిన వ్యక్తిని గుర్తు పడతావా అని ఆ బాలికను ఆయన ప్రశ్నించారు. తాను గుర్తు పడతానని ఆ బాలిక రెండుసార్లు చెప్పింది. దాడి జరిగినపుడు నీ వయసు ఎంత ఉంటుందని ఆయన ప్రశ్నించగా ఆరున్నరేళ్లని ఆ బాలిక సమాధానమిచ్చింది.

ఈ దశలో ఆ బాలికపై లైంగిక దాడి చేయడానికి ఎడియూరప్ప ప్రయత్నించారని చార్జిషీట్‌లో సిఐడి ఆరోపించింది. దీంతో భయపడిపోయిన ఆ బాలిక ఎడిచూరప్ప చేతిని విదిలించుకుని దూరంగా జరిగి తలుపు తీయవలసిందిగా ఆయనను కోరింది. ఆ తర్వాత తలుపు తీసిన ఎడిచూరప్ప ఆ తన జేలులో నుంచి కొత డబ్బు తీసి ఆ బాలిక చేతిలో పెట్టి బయటకు వచ్చారు. ఈ కేసులో తాను ఎటువంటి సహాయం చేయలేనని ఆ బాలిక తల్లికి చెప్పిన ఎడిచూరప్ప ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి వారిని బయటకు పంపించివేశారు. ఇది జరిగిన తర్వాత బాధితురాలి తల్లి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. ఫిబ్రవరి 20న ఎడియూరప్ప తరఫున ఆయన సహాయకులు అరుణ్, రుద్రేష్, మారిస్వామి ఆమె ఇంటి వచ్చి వారిద్దరినీ ఎడిచూరప్ప నివాసానికి తీసుకువెళ్లారు.

అరుణ్ అక్కడ ఆ మహిళ ఫోన్‌లోని ఫేస్‌బుక్ అకౌంట్‌లో నుంచి, ఫోన్ గ్యాలరీలో నుంచి వీడియోను డెలిట్ చేయించాడు. ఎడియూరప్ప ఆదేశాల మేరకు బాధిలురాలికి నగదు రూపంలో రూ. 2 లక్షలను నిందితులు ముట్టచెప్పారని చార్జిషీట్‌లో ఆరోపించారు. ఈ ఏడాది మార్చి 14న నమోదైన కేసులో బెంగళూరు కోర్టు ఎడియూరప్పపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జూన్ 13న జారీచేసింది. కాగా..ఎడియూరప్ప అరెస్టును నిలుపుదల చేస్తూ జూన్ 14న కర్నాటక హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. సిఐడి ఎదుట హాజరుకావాలని కూడా ఆయనను కోర్టు ఆదేశించింది. జూన్ 17న ఎడిచూరప్పను సిఐడి 3 గంటలకు పైగా ప్రశ్నించింది.

ఎడియూరప్పపై ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి గత నెల లంగ్ క్యాన్సర్‌తో ఆసుపత్రిలో మరణించింది. మార్చి 14న కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని మార్చి 14న బాధితురాలి సోదరుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎడియూరప్పను అరెస్టు చేసి ప్రశ్నించాలని పిటిషనర్ కోరారు. అయితే తనపై చేసిన ఆరోపణలను ఎడిచూరప్ప ఖండించారు. తాను న్యాయపరంగా పోరాడతానని ఆయన తెలిపారు. తనపై చేపట్టిన న్యాయపరమైన ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News