Friday, December 20, 2024

తెలుగు రాష్ట్రాలకు చిత్రసీమ అండ

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి చొప్పున విరాళం ప్రకటించిన బాలకృష్ణ, జూ.ఎన్‌టిఆర్, మహేశ్‌బాబు
సాయానికి ముందుకొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ సహా సినీ ప్రముఖులు

తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ ఈ వరద ప్రభావంతో చాలా మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా న ష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందు కు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాలని పలువురు స్టార్స్ పిలుపునిస్తున్నారు. ఇలా సినీపరిశ్రమ నుంచి పలువురు స్టార్స్ ముం దుకు రావడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బాలయ్య విరాళం
స్టార్ హీరో నం దమూరి బాలకృష్ణ వరద బాధితుల కు సహాయార్థం గా విరాళాన్ని ప్ర కటించారు. “ప్రస్తు తం తెలుగు నేల ను వరద ముం చెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ము ఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళం గా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అ తి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను”అని అన్నారు.

తారక్ భారీ విరాళం
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పెద్ద మనసుని, మానవత్వాన్ని చాటుకునే హీరో ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. వరద బాధితుల కు అండగా తనవంతు సాయాన్ని అందించటానికి ఆయన ముందుకు వచ్చారు. వరదలతో ప్రజలు ప డుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన ఎ న్టీఆర్… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా అందించారు.

వరద బాధితులకు అండగా మహేష్…
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర ద బాధితులను ఆదుకునేందుకు సూప ర్ స్టార్ మహేష్ బాబు ముందుకు కొచ్చారు. వరద బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకుగాను మహేష్… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ప్రజలంతా వరద బాధితులకు అండగా నిలచి వారికి సాయం చేయాలని ఈ సందర్భంగా మహేష్‌బాబు పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళా న్ని అందజేసిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్‌బా బు, విశ్వక్‌సేన్, అనన్య నాగళ్ల తదితరులకు సిఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

త్రివిక్రమ్, ఎస్. రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ విరాళం
గత కొద్దిరోజులుగా అటు ఆంధ్ర, ఇట్లు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నా యి. ఈ నేపథ్యంలో సంయుక్తంగా రు. 50 లక్షలు విరాళం ప్రకటించారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ. ఏపీకి రూ.25 లక్షలను, తెలంగాణకు రూ.25 లక్షలు… ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. “భారీ వ ర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలచి వేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాము”అని వారు పేర్కొన్నారు.

వరద బాధితులకు అండగా: సిద్ధు జొన్నలగడ్డ
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఆం ధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని చోట్ల వరదలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భీకరమైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు వారిని త్వరిత గతిన ఆదుకోవటానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సిద్ధు జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతు సాయం అందించటానికి ముందుకు వచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15 లక్షలు, తెలంగాణ రిలీఫ్ ఫండ్‌కు రూ.15 లక్షలు విరాళాన్ని అందించారు.

విశ్వక్ సేన్ సాయం
విశ్వక్ సేన్ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చొ ప్పున విరాళం అందజేశారు. ప్రజలంతా వరద బాధితులకు అండగా నిలిచి సాయం చేయాలని విశ్వక్‌సేన్ కోరారు.

బన్నీ వాసు విరాళం…
‘ఆయ్’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వ చ్చే కలెక్షన్లలో 25 శా తం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వర ద బాధితులకు విరాళంగా అందజేస్తామ ని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.

వెంకీ అట్లూరి, అనన్య నాగళ్ల సాయం
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు సాయంగా దర్శకుడు వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ.5 లక్షలు ప్రకటించారు. ఇక హీరోయిన్ అనన్య నాగళ్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2.5 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 2.5 లక్షలు విరాళంగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News