Saturday, December 21, 2024

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సెంటేజ్ కోరుతున్న సినీ ఎగ్జిబిటర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్ లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సెంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్టీప్లెక్స్ తరహాలోనే నిర్మాతకు పర్సెంటేజీలు చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని అన్నారు.

‘‘ కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. గత పదేళ్లలో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. బెనిఫిట్ షో, అదనపు షో లతో మోసాలకు పాల్పడుతున్నారు. జులై 1 వరకు నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని విజయేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసి ఉంచారు. వాటిని తిరిగి మే 25 తర్వాత సానుకూల అంశాలు ఉంటే తెరువబోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News