Sunday, December 22, 2024

అప్పుల బాధతో సినీరైటర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ సినీ రచయిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…..మణికొండ, పంచవటి కాలనీ, రోడ్డు నంబర్ 10, రామాలయం సమీపంలోని, విక్రం హైట్స్‌లో ఉంటున్న దాసరి లలితసాయి ప్రశాంత్(45) సీని యానిమేషన్ స్టోరీ రైటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రశాంత్‌కు వివాహం చేసుకోకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు.

అవకాశాలు లేకపోవడంతో ఖర్చుల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడం, తీర్చే దారి కన్పించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో సూసైడ్ నోట్ రాసి, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం ఎస్సై మన్మథరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News