Friday, December 27, 2024

‘సినిమాటికా ఎక్స్‌పో’ మూడో ఎడిషన్‌ను మరింత ఘనంగా నిర్వహిస్తాం

- Advertisement -
- Advertisement -

2004లో వచ్చిన అవార్డ్ విన్నింగ్ మూవీ గ్రహణం సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పి.జి. విందా, తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలోనే గొప్ప ఛాయాగ్రాహకుడిగా పేరు పొందారు. ది లోటస్ పాండ్ చిత్రంతో దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. రెండు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవ చేస్తున్న పి.జి. విందా, ఎప్పటికప్పుడు నూతన సాంకేతికలను పరిచయం చేయడంలోనూ ముందుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణల గొప్ప వేడుక ’సినిమాటికా ఎక్స్‌పో’కు శ్రీకారం చుట్టారు.

ఇటీవల హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎస్. కృష్ణన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎందరో సినీ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో పి.జి. విందా మాట్లాడుతూ “తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో గొప్ప దర్శకులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే హైదరాబాద్ సినీ రంగానికి అనువైన చోటు. అయితే అన్నీ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా వెనకబడిపోయాం. ముఖ్యంగా కొత్త కెమెరాలు, క్రేన్‌లు, ఇతర ఎక్విప్‌మెంట్‌లు మనకు ఆలస్యంగా పరిచయమవుతున్నాయి. అందుకే ఈ సినిమాటికా ఎక్స్‌పో నిర్వహించాలని తలపెట్టాము. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న ఎక్విప్‌మెంట్ గురించి ముందే తెలుస్తుంది. దీనికి ఏకంగా విశేష స్పందన లభించి, ఏకంగా 38 వేల మంది హాజరు కావడం అనేది ఆసియాలోనే రికార్డు. – ఫిల్మ్ మేకింగ్‌పై ఇప్పుడు ఎందరో ఆసక్తి చూపిస్తున్నారు.

డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. అందుకే సినిమాటికా ఎక్స్‌పో ద్వారా సాంకేతికతను పరిచయం చేయడం మాత్రమే కాకుండా, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి తగు సూచనలు చేస్తూ సెమినార్లు నిర్వహించాము. సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి సినీ ప్రముఖులు.. స్టోరీ రైటింగ్, సినిమాటోగ్రఫీ గురించి ఎంతో నాలెడ్జ్‌ని పంచారు. – ఈ స్పందన చూసిన తర్వాత సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ ను మరింత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాము. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం రావడానికి అంగీకారం తెలిపాయి. – తెలుగు సినీ ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా సహా అందరి మద్దతు ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, భాష, సాంస్కృతిక శాఖ మద్దతుతో ఈ సినిమాటికా ఎక్స్‌పోని మరో స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. – తెలుగు సాహిత్యం కోసం మా వంతు సహకారం అందించడంతో పాటు, యువ ప్రతిభ కోసం భవిష్యత్‌లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News