Friday, December 20, 2024

కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజంకాస్తా : చిరంజీవి

- Advertisement -
- Advertisement -

 

అందరు నన్ను చిత్ర పరిశ్రమకు పెద్దొడు అంటున్నారు కానీ పెద్దరికం అనుభవించాలని నాకు ఏమి లేదని, ఇండస్ట్రీలో తనకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారని చిరంజీవి అన్నారు. చిత్రపురి కాలనీ ఎంఐజి, హెచ్‌ఐజి ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమంలో చిరంజీవి పాల్గొని మాట్లాడుతూ సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టమని అన్నారు. ఇక చిత్రపురి కాలనీలో అవినీతి, అవకతవకలు జరిగాయని అన్నారు. కానీ ఆ విషయం గురించి తెలియదు కాబట్టి మాట్లాడడం సరైంది కాదని తెలిపారు. సిని కార్మికులకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్న సపోర్టుగా ఉంటానని, కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజంకాస్తా స్పష్టం చేశారు. కోరుకున్న దానికంటే భగవంతుడు నాకు ఎక్కువే ఇచ్చాడని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News