నియామకాలు పెంచే యోచనలో సిఐఒలు
డిజిటల్ సేవలు వేగవంతం చేయడంపైనే దృష్టి
కరోనా మహమ్మారి అనంతరం ఐటికి పెరిగిన ప్రాధాన్యత
గార్టర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : ఈ సంవత్సరంలో డిజిటల్ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు గాను ఐటి రంగంలో ఫుల్‌టైమ్ ఉద్యోగుల సంఖ్యను పెంచాలని చాలా వరకు సిఐఒ(చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు యోచిస్తున్నారు. ఐటి సర్వీస్ మేనేజ్‌మెంట్ సంస్థ గార్టర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వే ప్రకారం… 2021 సంవత్సరంలో మొత్తం ఎఫ్‌టిఇ(పూర్తి స్థాయి ఉద్యోగులు) సంఖ్యను పెంచేందుకు 55 శాతం మంది సిఐఒలు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాల వృద్ధిలో ప్రధానంగా ఆటోమేషన్, అనలిటిక్స్, మారుమూల ప్రాంతాల్లో పని మద్దతునిచ్చే విభాగాలపై దృష్టిపెట్టనున్నారు.
గార్ట్‌నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మాథ్యూ చార్లెట్ మాట్లాడుతూ, చాలా వరకు కంపెనీల్లో ఐటి కీలకపాత్ర పోషిస్తోంది. కరోనా మహమ్మారి అనంతరం ఐటి ఉద్యోగాల నియామకం యోచనపై సానుకూల ప్రభావం కనిపిస్తోందని అన్నారు. 2020 మధ్య కాలంలో సిఐఒలు వ్యక్తం చేసినదేమిటంటే 2021లో ప్రతిభ విషయంలో ఆశావాదం పెరిగింది. ప్రస్తుతం డిజిటల్ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఈ ఏడాదిలో ఐటి ప్రతిభా వ్యూహాలకు ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆటోమేషన్ బిజినెస్ ఆపరేషన్స్, క్లౌడ్ అడాప్షన్‌లో వృద్ధిపై దృష్టిపెట్టనున్నారు. మొత్తంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌లు ఫుల్‌టైమ్ ఉద్యోగులను మరింత పెంచుకోవాలని చూస్తున్నారని నివేదిక తెలిపింది.
రిమోట్ వర్క్, అనలిటిక్స్, క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్‌లో గణనీయమైన పెట్టుబడుల నుంచి ముప్పును తగ్గించేందుకు గాను సెక్యూరిటీ పర్సనల్ వృద్ధి అవసరమవుతుంది. డేటా సెంటర్లు, నెట్‌వర్క్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, అప్లికేషన్ మెయింటెనెన్స్‌లో చాలా వరకు ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. క్లౌడ్ సేవల వైపు తరలిపోవడమే దీనికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, 74 శాతం సిఐఒలు సెక్యూరిటీ ఆపరేషన్లలో 2 శాతం వరకు సిబ్బందిని పెంచాలని భావిస్తున్నారు. ఆ తర్వాత అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్స్‌లో 73 శాతం, బిజినెస్ వర్క్‌ఫ్లోస్ 71 శాతం ఉంది.