నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా ‘సర్కిల్‘. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు నీలకంఠ మీడియాతో మాట్లాడుతూ “సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం.
విధి అనే కాన్సెప్ట్ ఓ వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి.. ఎట్లా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందని మెయిన్ థీమ్‌గా తీసుకున్నాం. ఇది రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ కాదు. ఇన్వెస్టిగేషనల్ టైప్‌లో కాకుండా.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రన్ చేశాం. ఈ సినిమాలో సాయి రోనక్ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తాడు. ముగ్గురు హీరోయిన్లు ముఖ్యమైన పాత్రలు చేశారు. బాబా భాస్కర్ క్యారెక్టర్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. తనదైన శైలిలో కామెడీని టచ్ చేస్తూనే విలన్‌గా మెప్పించాడు. ఈ సినిమాలో కాన్సెప్ట్‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా చూపించాము”అని అన్నారు.