మనుషులు తిరిగే వీధిలో ఓ సింహం ఎదురుపడితే, ఏం జరుగుతుందో వేరే చెప్పాలా? ఆ సింహం గర్జిస్తూ, పరుగులు పెడుతుంటే చూసేవాళ్ల గుండెలు ఆగిపోవూ? అదే జరిగింది ఇటలీలోని లాడిస్ పోలీ అనే పట్టణంలో. సర్కస్ లోంచి తప్పించుకున్న ఓ సింహం వీధుల్లోకి వచ్చేసింది. గర్జిస్తూ, అటూ ఇటూ తిరుగుతుంటే, దాన్ని చూసినవారు పరుగో పరుగు. దాన్ని వెతికి పట్టుకునేందుకు సర్కస్ సిబ్బంది వలలూ, ట్రాంక్విలైజర్లూ పట్టుకుని పరుగెత్తారు. ఎంతకూ ఆ సింహం కనబడదాయె. ఈలోగా అధికారులు మేల్కొని ప్రజల్ని అప్రమత్తం చేశారు. వీధుల్లో సింహమొకటి తిరుగుతోందనీ, ఎవరూ బయటకు రావద్దని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. ఓ గంట పోయాక, సర్కస్ సిబ్బంది ఆ సింహాన్ని చూసి, పట్టుకున్నారు. ఈలోగా ఎవరూ సింహానికి ఎదురుపడకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది.
Residents of Ladispoli, a seaside town near Rome, have been told to stay indoors after a lion escaped from a circus on Saturday. Efforts are underway to capture the animal.pic.twitter.com/GL0bQmVGWZ
— Wanted in Rome (@wantedinrome) November 11, 2023
A lion escaped from a circus near Rome, prompting authorities to advise people to stay at home. 🇮🇹
The attempts to capture the lion have been unsuccessful.
Ladispoli Mayor Alessandro Grando urged maximum caution, stating, “Circus employees are working with police support on a… pic.twitter.com/klvF3iO2mC
— Russian Market (@runews) November 11, 2023