Friday, January 17, 2025

సిఐ తల్లిని చంపి… పూడ్చిపెట్టారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాశీ నుంచి స్వామీజీ వచ్చారని, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తారని ఓ సిఐ తల్లిని బయటకు తీసుకెళ్లి ఆమెను చంపేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఒకటో పట్ణణం పోలీస్ స్టేషన్‌లో నాగేంద్ర ప్రసాద్ సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. సిఐ నాగేంద్ర తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా మదనపల్లెలో నివసిస్తున్నారు. స్వర్ణకుమారి ఇంటికి సమీపంలో వెంకటేశ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆమెకు చేదోడువాదోడుగా ఉండేవాడు.

స్వర్ణకుమారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కాజేయాలని ప్లాన్ వేశాడు. కాశీ నుంచి స్వామిజీ వచ్చాడని, ఆయన మంత్రంతో అనారోగ్య సమస్యలు మటుమాయం అవుతాయని చెప్పాడు. సెప్టెంబర్ 28 ఆమెను పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలోని అనిల్ ఇంటికి తీసుకెళ్లాడు. తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఆమె తాగించారు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత స్వర్ణకుమారి తలపై సుత్తెతో మోది హత్య చేశారు. అనిల్ సాయంతో మృతదేహాన్ని అయోధ్యనగర్‌లోని శ్మశాన వాటికకు తీసుకెళ్లి పూడ్చిపెట్టాడు. సెప్టెంబర్ 30న బెంగళూరుకు పారిపోయాడు.

తల్లి కనిపించడంలేదని సిఐ నాగేంద్ర ప్రసాద్ మదనపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేష్‌పై అనుమానం రావడంతో అతడిని బెంగళూరులో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అనిల్ పరారీలో ఉండడంతో అతడి తల్లి రమాదేవిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News