Monday, December 23, 2024

జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన సిఐలు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ఇటీవల బదిలీలైన నూతన సిఐలు తమకు కేటాయించిన పోలీసు సర్కిల్ కార్యాలయాల్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని డోర్నకల్ సిఐగా పోస్టింగ్ పొందిన ఊపేందర్‌రావు బాద్యతులు చేపట్టారు. 2009 బ్యాచ్‌కు ఎసైగా మొదటి పోస్టింగ్ నల్లబెల్లిలో, ఆ తర్వాత నెల్లికుదురు, డోర్నకల్ జీఆర్పీలో విధులు నిర్వహించారు. 2018లో సీఐగా పదోన్నతి పొంది సీఐడీ, ఆశ్వరావుపేట, డిసిఆర్‌బి (కొత్తగూడెం) బాధ్యతలు నిర్వహిచిన ఆయన డోర్నకల్ సిఐగా బదిలీ అయ్యారు.

గూడూరు సిఐగా ఫణిధర్.. జిల్లా పరిధిలోని గూడూరు సిఐగా ఫణిధర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐగా మొదటి పోస్టింగ్ జాఫర్‌గడ్‌లో చేపట్టిన ఆ తర్వాత మట్టేవాడ, కేసముద్రం, తొర్రూరు ట్రాఫిక్, ఇంటెటిజెన్స్, నెల్లికుదురులో విధులు నిర్వహించి 202లో సీఐగా పథోన్నతి పొందారు. ఆదిలాబాద్‌లో ట్రాఫిక్ సిఐగా, మహబూబాబాద్ డిసిఆర్‌బి, స్పెషల్ బ్రాంచి ఇన్స్‌పెక్టరుగా విధులు నిర్వహించిన ఫణిధర్‌ను గూడురు సిఐగా బదిలీ చేశారు.

కాగా గూడూరు సిఐగా పనిచేసి యాసిన్ మహబూబాబాద్ స్పెషల్ బ్రాంచి సిఐగా బదిలీ కాగా ఆయన కూడా బుధవారం బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముగ్గురు సిఐలు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను మార్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News