ముంబయి: ఉషోదయ మూవీస్ కింద నిర్మించిన ‘మయూరి’సినిమాలో నటించి బాగా పేరు తెచ్చుకున్న నటి సుధా చంద్రన్. ఆమెకు ఓ రోడ్డు ప్రమాదంలో కాలు పోయింది. అందువల్ల ఆమె కృత్రిమ కాలును ఉపయోగిస్తుంటారు. అయితే విమానాశ్రయంలో రక్షణ బాధ్యతలు, తనిఖీ నిర్వహించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్‌ఎఫ్)కు చెందిన మహిళా పోలీసులు ఆమె కృత్రిమ కాలును తొలగించమని కోరి అవమానించారు. అయితే దీనికి సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ క్షమాపణలు చెప్పుకుంది.
నటి సుధా చంద్రన్ వికలాంగులను ఇబ్బంది పెట్టే విమానాశ్రయంలోని ఇటిడి ప్రొసీజర్‌ను తప్పుపడుతూ ప్రధానికి ట్యాగ్ చేశారు. ఈ ఫిర్యాదుకు ప్రతిస్పందించిన సిఐఎస్‌ఎఫ్ కొన్ని అనివార్య పరిస్థితిలో తనిఖీ చేసేప్పుడు కృత్రిమ కాలును తీయమని కోరినందుకు క్షమాపణ చెప్పుకుంది.
We are extremely sorry for the inconvenience caused to Ms. Sudhaa Chandran. As per protocol, prosthetics are to be removed for security checks only under exceptional circumstances. 1/2
— CISF (@CISFHQrs) October 22, 2021