Sunday, December 22, 2024

సహోద్యోగులపై సిఐఎస్‌ఎఫ్ జవాన్ కాల్పులు… ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

CISF jawan fired at colleagues... one died

కోల్‌కతా : కోల్‌కతాలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు మ్యూజియం బ్యారెక్ వద్ద ఒక సిఐఎస్‌ఎఫ్ జవాన్ సహోద్యోగులైన ఎఎస్పీ, హెడ్ కానిస్టేబుల్‌పై కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడి ఇండియన్ మ్యూజియం భద్రతను 2019 డిసెంబర్ నుంచి సిఐఎస్‌ఎఫ్ చూస్తోంది. శనివారం జవాన్ ఒకరు సహోద్యోగులైన ఎఎస్పీ, హెడ్ కానిస్టేబుల్‌పై సర్వీస్ గన్‌తో కాల్పులు జరిపాడు. రంజిత్‌కుమార్ సారెంగి అనే జవాను మరణించగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు ఒక పోలీస్ వాహనం పైనా కాల్పులు జరిపాడు. ఆ వాహనం డ్రైవర్‌తోపాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. నిందితుడి నుంచి గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News