Monday, December 23, 2024

సిపిఆర్ చేసి వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ఉన్నటుండి ఆకస్మాతుగా కిందపడిపోయి చావు వరకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాన్ని సిఐఎస్ఎఫ్ సిబ్బంది కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్న ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో నడుస్తూనే కుప్పకూలిపోయాడు. గమనించిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి అతనికి సిపిఆర్ చేసి బ్రతికించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సిఐఎస్ఎఫ్ తన ట్వీటర్ ఖాతాలో చేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News