Wednesday, January 22, 2025

శ్రీహరికోటలో మరో విషాదం.. గన్ తో షూట్ చేసుకుని సిఐఎస్ఎఫ్ ఎస్సై ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షారులో మరొ దారుణం జరిగింది. సిఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ సింగ్ అనే వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరినట్లు తెలుస్తోంది.

ఎస్సై వికాస్ సింగ్ కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎస్సై వికాస్ సింగ్ మృతి పట్ల తోటి సిబ్బంది, అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్న ఇక్కడే ఓ జవాను చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ప్రస్తుతం అంతరిక్ష పరిశోధన సంస్థలో కలకలం రేపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News