Wednesday, January 22, 2025

శ్రీహరికోటలో మరో విషాదం.. ఎస్సై భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న శ్రీహరికోటలో ఉత్తరప్రదేశ్ కు చెందిన సిఐఎస్ఎఫ్ ఎస్సై వికాస్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకుని వెంటనే శ్రీహరికోటకు చేరుకున్న వికాస్‌ సింగ్‌ భార్య.. తన భర్త మరణాన్ని తట్టుకోలేక మంగళవారం రాత్రి నర్మద గెస్ట్‌హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆదివారం ఓ జవాను చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఎస్సై వికాస్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. గత మూడు రోజులు వరుసగా అంతరిక్ష పరిశోధన సంస్థలో చోటుచేసుకున్న ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News