Monday, December 23, 2024

సిసోతో సైబర్ నేరాలకు చెక్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సిసో ఏర్పాటుతో సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఇండియాలో మొదటి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐఎస్‌ఓ కౌన్సెల్‌ను డిజిపి అంజనీకుమార్, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ మాట్లాడుతూ తనతో పాటు సైబర్ సెక్యూరిటీ సెమినార్‌లో పాల్గొన్న బ్యూరోక్రాట్‌ను సైబర్ నేరస్తులు నమ్మించి రూ.5లక్షలు కొట్టేశారని తెలిపారు. ప్రతి ఏడాది కంపెనీలపై వేలాది సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

సైబరాబాద్ పోలీసులు సైబర్ క్రైం బాధితులకు రూ.2.2కోట్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించారని తెలిపారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించేందుకు పోలీసులు అన్ని ఆటంకాలు దాటి అందజేశారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాల్లో 2023లో బాధితులు 8 ట్రియన్లు నష్టపోయారని తెలిపారు. ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సైబర్ సెక్యూరిటీకి గొప్పదని అన్నారు. మాస్టర్ కార్డు సిఈఓ తమ కంపెనీపై 10,000 సార్లు సబర్ దాడులు జరిగాయని చెప్పారని తెలిపారు. రమేష్ ఖాజా, అభిషేక్ కుమార్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమలో పోలీస్ అధికారులు, వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News