Tuesday, September 17, 2024

నిర్లక్ష్యం… ముగ్గురు పిల్లలను మింగిన నీటి తొట్టి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జిల్లాలో వేర్వేరు ప్రాంతాలలో ముగ్గురు పిల్లలు నీటి తొట్టిలో పడి మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా రుసుంపల్లి గ్రామంలో శ్రీహరి, లలిత అనే దంపతులు నివసిస్తున్నారు. దంపతులు పొలం పనులకు వెళ్తూ తన రెండేళ్ల కూతురు గౌతమి తన అమ్మమ్మ, తాత దగ్గర విడిచిపెట్టారు. గౌతమి ఆడుకుంటూ వెళ్లి పశువులు తాగే నీటి తొట్టిలో పడి దుర్మరణం చెందింది. నారాయణ పేట జిల్లా గుండుమాల్ మండలం బలభద్రయపల్లి గ్రామంలో నర్సింహులు, కవిత అనే దంపతులు నివసిస్తున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు నిహాన్స్(03), భానుమూర్తి(02) ఉన్నారు. భర్త పొలం పనులకు వెళ్లడంతో భార్య అనారోగ్యంలో ఇంటిలో ఉండిపోయింది. భార్యకు ఒంట్లో బాగోలేకపోవడంతో నిద్రకు ఉపక్రమించింది. పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ వెళ్లి సిమెంట్ రింగులతో ఏర్పాటు చేసిన తొట్టిలో పడ్డారు. కాసేపటికి తల్లి గమనించి ఇద్దరిని తొట్టిలో నుంచి బయటకు తీసి కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఇద్దరు పిల్లలు మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News