Monday, January 20, 2025

అదానీ షేర్లకు మార్జిన్ మనీ నిరాకరించిన సిటీగ్రూప్!

- Advertisement -
- Advertisement -

ముంబై: గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లను కుదువ(కొల్లాటెరల్‌గా) పెట్టుకుని మార్జిన్ మనీ ఇవ్వడానికి సిటీగ్రూప్ ఇన్‌కార్పొరేషన్ నిరాకరించింది. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ ఆర్థిక మోసాలకు, స్టాకుల అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించిన నేపథ్యంలో బ్యాంకులు ఇప్పుడు ఆయన కంపెనీ షేర్లను కొల్లాటెరల్‌గా పెట్టుకుని మార్జిన్ మనీ ఇవ్వడానికి సంకోచిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు తోడు క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజి కూడా అప్పులు ఇవ్వడంలో జాగ్రత్త పాటిస్తోంది. అదానీ గ్రూప్ షేర్లు ఇప్పుడు మరింత నష్టాల్లో కూరుకుపోయాయి.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు, బాండ్ల విలువ బాగా పడిపోయినందున సిటీగ్రూప్ ఇంటర్నల్ మెమోలో బ్లూమ్‌బర్గ్‌ను కోట్‌చేస్తూ వ్యాఖ్యానించింది. అదానీ గ్రూప్ షేర్లకు లెండింగ్ వ్యాల్యూను తొలగించినట్లు సిటీ బ్యాంకు తన మెమోలో పేర్కొంది. దీని ప్రభావం మార్జిన్ లెండింగ్ పోర్ట్‌ఫోలియోపై పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News