మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్లుండి వాయుగుండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి గురువారం నాటికి బలపడనుందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ- 22న ఉదయానికి వాయుగుండంగా మారుతుందని హెచ్చరించింది. ఆ తరువాత ఇది మరింతగా బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రాగల మూడురోజులు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్ర తీ రంలో గంటకు మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 21, 22 ఇవి 65కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తుపాన్ ప్రధానంగా ధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటుతుందని వస్తున్న ముందుస్తు సంకేతాలతో తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అ యితే సిత్రాంగ్ తుపాన్ ఎక్కడ తీరం దాటుతుందో ఇంకా స్పష్టం కాలేదని భారతీయ వా తావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డా.మృ త్యుంజయ మహాపాత్రో వెల్లడించారు. ఈ నెల 25నాటికి సిత్రాంగ్ తుపాన్ పశ్చిమ బెంగాల్ ధీఘా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ జిఎఫ్‌ఎస్ ముందస్తు సామాచారం ఇచ్చింది. నేపథ్యంలో కేంద్ర విపత్తు నిర్వహణ విభాగం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ నెల 22 తర్వాత ఏ క్షణంలోనైనా తుపాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది.
Citroen Cyclone Effect to Telugu States