Wednesday, January 22, 2025

సమంత ‘యశోద’ ఒటిటి విడుదలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

సమంత ‘యశోద’ ఒటిటి విడుదలకు బ్రేక్
తమ ప్రతిష్టనుదెబ్బ తీసేలా చూపించారంటూ కోర్టుకెక్కిన ఇవా హాస్పిటల్
డిసెంబర్ 19 వరకు ఒటిటిలో విడుదల చేయొద్దని ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: టావీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో తమ హాస్పిటల్ ప్రతిష్టను దెబ్బ తీసేలా చూపించారని ఇవా హాస్పిటల్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. యశోద చిత్రంలో సమంత క్యారెక్టర్‌తో ఇవా హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతినెలా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

సినిమాలో చూపించిన హాస్పిటల్ పేరు వల్ల ప్రస్తుతం నడుస్తున్న తమ ఇవా హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతింటుందని న్యాయస్థానానికి తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. యశోద సినిమా యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. అప్పటివరకు యశోద సినిమాను ఒటిటిలో విడుదల చేయవద్దని కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News