Monday, November 18, 2024

రేవంత్ నోటికి తాళం

- Advertisement -
- Advertisement -
City Civil Court Issues Notice To Revanth Reddy
డ్రగ్స్, ఇడి కేసులకు సంబంధించి మంత్రి కెటిఆర్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు
సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు
కెటిఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు మూడో అదనపు సీనియర్ న్యాయమూర్తి

మనతెలంగాణ/ హైదరాబాద్: డ్రగ్స్,ఇడి కేసుల్లో మంత్రి కెటిఆర్‌పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డికి సిటీ సివిల్ కోర్టు మంగళవారం నాడు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈక్రమంలో తన పరువుకు భంగం కల్గించారని టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కెటిఆర్ వేసిన పరువునష్టం దావా కేసుపై సిటీ సివిల్ కోర్టు మూడో అదనపు సీనియర్ న్యాయమూర్తి విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇడి,డ్రగ్స్‌పై ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగిస్తున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం పరువునష్టం దావా వేయగా వివరాలు సక్రమంగా లేవని చెప్పడంతో మంగళవారం మరోసారి మంత్రి దావా వేశారు.

దీంతో సిటీ సివిల్ కోర్టు డగ్స్ కేసు, ఇడికేసుల్లో కెటిఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. కాగా తన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కెటిఆర్ కోరడంతో మధ్యంతర ఉత్తర్వులను సిటీ సివిల్ కోర్టు తొలుత రిజర్వ్ చేసింది. తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటిషనర్ కోరారు. దీంతో డ్రగ్స్ కేసులో, ఇడి కేసులో మంత్రి కెటిఆర్‌పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదని సిటీ సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 20కి కోర్టు వాయిదా వేసింది.

ఇలా మొదలైంది…

పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు ఒకరు ట్వీట్ చేస్తే దానికి ప్రతిగా మరొకరు కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ పరీక్షలపై రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కెటిఆర్ స్పందిస్తూ తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఒప్పుకొంటే ఢిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు తాను సిద్ధమన్నారు. తనది చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదని, పరీక్షల్లో క్లీన్‌చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో లై-డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా’ అని రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ ఆరోపణలపై పరీక్షలకు రెడీ కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధమేనా?రేవంత్ కౌంటర్..దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌తో కలిసి లై-డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని దీనికి సమయం, స్థలం చెప్పాలన్నారు.

రేవంత్ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారంపై కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు కెటిఆర్ తెలిపారు. మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని మంత్రి కెటిఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువునష్టం చర్యలుగా పరిగణించి పత్రికలు, టివిలు, సామాజిక మాధ్యమాల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్‌రెడ్డిని ఆదేశించాలని కోరారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశించాలన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేయడంతో డ్రగ్స్,ఇడి కేసుల్లో మంత్రి కెటిఆర్‌పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డికి సిటీ సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News