హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా రూ.2 కోట్ల 11లక్షల విషయమై దాసరి కుమారులపై సోమశేఖర్‌రావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాసరి నారాయణరావు కుమారులు దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లు వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం రూ.2 కోట్ల 11లక్షల తీసుకున్నారని సోమశేఖర్‌రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తిరిగి డబ్బులు చెల్లించంలో వీరిద్దరూ జాప్యం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారించిన సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ 34, రూల్స్ అండ్ కింద దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లకు నోటీసులు ఇచ్చింది. వారు తీసుకున్న డబ్బులను సోమశేఖర్‌రావుకు తిరిగి చెల్లించడానికి నవంబర్ 15 వరకు కోర్టు గడువు విధించింది. కాగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకు తనను చంపుతామని దాసరి కుమారులు బెదిరిస్తున్నారని గతంలోనే పిటిషనర్ సోమశేఖర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
‘దాసరి’ ఇంటికి సిటి సివిల్ కోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -