సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై నగర సిపి సమీక్ష
హాజరైన రాచకొండ, సైబరాబాద్ సిపిలు
హైదరాబాద్ సిపి సివి ఆనంద్
హైదరాబాద్: నగరాలలో మహిళలకు రక్షణ కల్పించడంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కీలకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేష్ భగవత్, స్టిఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రొగ్రాం మేనేజర్లను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మహిళలు, బాలికలపై బహిరంగ ప్రదేశాలలో జరిగేటువంటి నేరాలను నియంత్రించాలని, అవకాశాలను అందిపుచ్చుకునే సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. ః
లింగపరమైన హింస, వేధింపులు లేకుండా, నిర్భయంగా పనిచేసే అవకాశాలు కల్పించాలని అన్నారు. టిఎస్, జిహెచ్‌ఎంసి భాగస్వాములతో కలిసి మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, పెళికాన్ సిగ్నల్స్ ఏర్పాటు, నిఘా వ్యాన్ల, ప్రెస్సింగ్ ఎవి, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బడ్జెట్ పరమైన అంశాలు, సిసిటివిల సేకరణ, ఇతర పాలనపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో అదనపు డిజి స్వాతిలక్రా, అదనపు పోలీస్ కమిషనర్లు డిఎస్ చౌహాన్, జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్ ప్రియాంక, జనరల్ మేనేజర్ టిఎస్‌ఆర్‌టిసి పుష్పరాథోడ్, ఐడి ఎఆర్ శ్రీనివాస్, జాయింట్ సిపిలు రమేష్, ఎవి రంగనాథ్, గజారావు భూపాల్ తదితరలు పాల్గొన్నారు.