పాల్గొన్న రాచకొండ, సైబరాబాద్ సిపిలు
మనతెలంగాణ, సిటిబ్యూరో: సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా హైటెక్ కెమెరాలు ఇన్‌స్టాల్ చేశామని, వీటి ద్వారా మహిళలకు మరింత భద్రత ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ ఆఫీసర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర, నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్ పాల్గొన్నారు. సేఫ్ సిటి ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలో 3,168 సిసి కెమెరాలు ఇన్‌స్టాల్ చేశామని తెలిపారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వీటిని అమర్చామని అన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ పనులను మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వేగంగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్, టెక్నాలజీ కమ్ ప్రాసెస్ ఎక్స్‌పర్టులు పాల్గొన్నారు.