Monday, December 23, 2024

నగరాభివృద్ధి నిధులు కేటాంచాలి : చింతల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ అభివృద్ధి కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టినట్లు చెబుతున్నా.. కొద్దిపాటి వర్షానికే నాలాలు నిండి రోడ్లపైకి, ఇండ్లలోకి నీరు వస్తున్నాయని బిజెపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో చిన్న వర్షానికే నాలాలు నిండి రోడ్లపైకి, ఇండ్లలోకి నీరు వస్తున్నాయని, 40 సెంటిమీటర్ల వర్షం పడినా ఏమీ ఇబ్బందులు కలగకుండా చూస్తామని బిఆర్‌ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలోని 20 లక్షల మందికి తాగునీరు అరకొరగా సరఫరా అవుతోందన్నారు. ఇతర రాష్ట్రాల్లోని చిన్న నగరాలు, తక్కువ జనసాంద్రత ఉన్న చోట్ల అధిక బడ్జెట్ కేటాయిస్తున్నారు. వాటికంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన హైదరాబాద్ నగరానికి కేటాయించే బడ్జెట్ చాలా తక్కువ ఉందన్నారు.

మెహిదీపట్నం నుంచి బిహెచ్‌ఈఎల్ వరకు మెట్రో రైలు ప్రతిపాదన ఏమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా ఇవ్వకున్నా యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగిస్తామన్నా ఎందుకు సహకరించలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు గుర్తుకు వస్తేనే అభివృద్ధి చేస్తామని అంటారు.. ఆపై మళ్ళీ మరిచిపోతారని విమర్శించారు. యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో నగర బిజెపి నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News