Friday, December 20, 2024

నగరాభివృద్ధే ప్రథమ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నగరంపై ఉన్న ప్రేమతో అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరుగుతుందని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా సోమవారం 11, 15 డివిజన్‌లలో పర్యటించారు.

82 లక్షల సాధారణ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 11వ డివిజన్ కట్టరాంపూర్‌లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సయ్యతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 12 లక్షల సాధారణ నిధులతో ఎస్‌డబ్లుజీ పైపులైన్ డైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు.

అనంతరం 15వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ నాగసముద్రం జయలక్ష్మితో కలిసి 70 లక్షలతో మూడు చోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రగతినగర్ ప్రాం తంలో 21 లక్షలతో ఎస్‌డబ్లుజీ డైనేజీ పైపులైన్, సీసీ ప్యాచ్‌వర్క్ పనులకు భూమి పూజ చేశారు. మరోవైపు కాలనీలో 30 లక్షల సాధారణ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణంకు, మరోచోట 19 లక్షల సాధారణ నిధులతో ఎస్‌డబ్లుజీ డైనేజీ పైపులైన్ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ప్రారంభం చేసిన పనులను వేగవంతం నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ మహేందర్, డీఈలు లచ్చిరెడ్డి, ఏఈలు వాణీ, నిఖిత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News