Monday, December 23, 2024

నగర పారిశుద్యంపై మరింత దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

అధికారులకు మేయర్ ఆదేశం

City needs to focus more on sanitation

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర పారిశుద్ధ్య చర్యలపై పూర్తిస్థాయి దృష్టి సారించాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను అదేశించారు. సోమవారం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో జోనల్ సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ పారిశుద్ద కార్మికుల చర్యలు తీసుకోవడంతోపాటు వారు సకాలంలో విధులకు కావడం, నిర్ధేశించిన సమయం మేరకు పని చేయించడంలో ఎఎంహెచ్‌ఓలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఉదయం 11 గంటల తర్వాత కూడా పారిశుద్ద కార్మికుల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.

జవాన్ కేడా డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. జోనల్‌లో చేపట్టిన టాయిలెట్లన్ని పని చేయాలని, మరమ్మతులుంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఆర్‌డిపి పనుల్లో చేపట్టిన 9 పనులు నిర్ధేశించిన కాలంలో పూర్తి చేయాలన్నారు. తుకారాం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసిన ఈనెలలో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. కమ్యూనిటీ హాళ్లు నిర్మించి వదిలిపెడితే సరిపోదని, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎవరూ నిర్వహిస్తున్నారో పరిశీలించడంతోపాటు పార్కులు వివరాలను కూడా పూర్తి నివేదికను అందజేయాలన్నారు. ఎస్‌ఎన్‌డిపి ద్వారా చేపడుతున్న పనులకు ఏలాంటిఅంతరాయ లేకుండా ఈ నెల 15లోపు భూసేకరణ పూర్తి చేయాలని అదేశించారు. వచ్చే వర్షకాలం నాటికి పన్నులన్ని పూర్తి చేసే లక్షంగా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కాకుండా పూర్తిస్థాయిలో తొలగించాలన్నారు.

సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని, తెలంగాణకు హరితహారం ప్రారంభించే నాటికి నర్సరీలో నిర్ధేశించిన మొక్కలు సిద్దంగా ఉండాలని తెలిపారు. కాలనీల్లో మరింత పచ్చదనాన్ని పెంపోందించేందుకు కార్పొరేటర్లు, కాలనీ అసోసియేషన్ సభ్యులు భాగస్వామ్యంతో లక్షాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌సిలు అనిల్‌రాజ్, బాస్కర్‌రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి రంజిత్ డిప్యూటీ కమిషనర్లు మోహన్‌రెడ్డి, ముకుందరెడ్డి, వేణుగోపాల్, హరికృష్ణ, ప్రాజెక్టు ఈఈ గోపాల్ ఎఎంహెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News