Sunday, April 6, 2025

నగర పాలక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి

- Advertisement -
- Advertisement -

రామగుండం కార్పొరేషన్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న నేపథ్యంలో రామగుండం నగర పాలక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని మేయర్ డాక్టర్‌బంగి అనిల్ కుమార్ ఆదేశించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సుచరణ్, సూపరింటెండెంట్ మనోహర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యామ్, నాగభూషణం, సునీల్‌తోపాటు శానిటరీ సూపర్ వైజర్‌లతో సమీక్ష నిర్వహించి, అత్యవసరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు.

నగర పాలక సంస్థ కార్యాలయంలో 24 గంటల పాటు కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సహాయం కోసం ఫోన్ వచ్చిన తక్షణమే డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్ స్పందించేలా వాహనాలు, ఇంధనం, పని మూట్లు సిద్ధంగా ఉండాలని అన్నారు. గత అనుభవనాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వర్షాల ప్రభావం తగ్గేంత వరకు మున్సిపల్ సిబ్బంది సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ సమన్వయంతో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News