- Advertisement -
హైదరాబాద్: డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు తమ పరిధిలో గురువారం ర్యాలీలు నిర్వహించారు. షాహినాయత్‌గంజ్, ఫలక్‌నూమా పోలీసులు బ్యాన్లు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. గోషమహల్ ఎసిపి సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్‌స్పెక్టర్ విజయ్‌కుమార్, ఎస్సైలు, పోలీసులు, స్థానికులు కలిసి ర్యాలీ నిర్వహించారు. నషా ముక్త నగరం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. షలక్‌నూమ పోలీసులు డ్రగ్ ఫ్రీ వాక్ నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని సేఫ్ సిటీ, ఫ్రీ డ్రగ్ అడిక్షన్‌గా చేయాలని నినాదాలు చేశారు. డిఐ కెఎస్ రవి, ఎస్సైలు డిటి సింగ్, వెంకటేశ్వర్ జీ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్ నుంచి ఫాతీమా నగర్ నుంచి వట్టేపల్లి వరకు నిర్వహించారు.
- Advertisement -