Sunday, December 22, 2024

విమానయాన ఛార్జీలు తగ్గిస్తాం: రామ్ మోహన్ నాయుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కింజారపు రామ్ మోహన్ నాయుడు గురువారం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సాధారణ వ్యక్తులకు కూడా అందుబాటులో ధరలు ఉండేలా విమాన ఛార్జీలు తగ్గించనున్నట్లు ఆయన చూచాయగా తెలిపారు.  ప్రతి ఒక్కరు విమానయానం చేసేలా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. అయితే విమాన ఛార్జీలు చౌకగా మారినప్పుడే సామాన్యులు సైతం విమానయానం చేయడానికి వీలవుతుందన్నారు.

‘‘ నన్ను విమానయాన శాఖ మంత్రిగా ప్రకటించాక, నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు విమాన ఛార్జీలు ఎక్కువ ఉన్నట్లు, గత కొన్ని సంవత్సరాలలో పెరిగినట్లు…ముఖ్యంగా కోవిడ్ తర్వాత బాగా పెరిగినట్లు తెలిపారు. ఈ విషయాన్ని నేనింకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంది. స్టేక్ హోల్డర్లతో కూర్చుని నేను దీని మీద చర్చిస్తాను’’ అని రామ్ మోహన్ నాయుడు ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నుంచి మూడో సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన వయస్సు 36 ఏళ్లు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News