Sunday, December 22, 2024

నాగర్‌కర్నూలు జడ్‌పి ఛైర్‌పర్సర్‌కు కోర్టులో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నాగర్‌కర్నూలు జడ్‌పి చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతికి గురువారం కోర్టులో చుక్కెదురైంది. తెలకపల్లి జడ్‌పిటిసిగా పద్మావతి ఎన్నిక చెల్లదని నాగర్‌కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది. పద్మావతికి ముగ్గురు సంతానం ఉండటం వల్ల ఎన్నిక చెల్లదని కోర్టు పేర్కొంది.2019లో జరిగిన ఎన్నికల్లో పద్మావతి తెలకపల్లి స్థానం నుంచి టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి జడ్‌పిటసిగా గెలుపొందారు.

పద్మావతికి ముగ్గురు పిల్లలున్నారని సమీప ప్రత్యర్థి సుమిత్ర కోర్టును ఆశ్రయించారు. ఆమె నామినేషన్ తిరస్కరించాలని కోరగా రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. దీంతో నాగర్‌కర్నూలు కోర్టును కాంగ్రెస్ నాయకురాలు సుమిత్ర ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో రెండో అభ్యర్థిగా ఉన్న సుమిత్రను జడ్‌పిటిసిగా కొనసాగాలని ఆదేశించింది.

Civil Court shock to NagarKurnool ZP Chairperson

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News