Wednesday, January 22, 2025

సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) నిర్వహించిన సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ మెయిన్స్‌కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యుపిఎస్‌సి వెల్లడించింది. సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది మెయిన్స్‌కు ఎంపికైనట్టు సివిల్స్ శిక్షణ సంస్థలు అంచనా వేస్తున్నారు. ఈనెల 5న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను యుపిఎస్‌సి నిర్వహించింది. తెలంగాణ నుంచి 26 వేల మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి నుంచి సుమారు 24 వేల మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు.

Civil Prelims 2022 Exam Results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News