Wednesday, January 22, 2025

బిసి స్టడీ సర్కిల్స్‌లో…. సివిల్ ప్రిలిమ్స్ ఆఫ్ లైన్ గ్రాండ్‌టెస్ట్‌ల నిర్వహణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ బిసి స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 (ప్రిలిమ్స్) ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. రా్రష్ట్రంలోని మొత్తం 12 బిసి స్టడీ సర్కిల్స్‌లో యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) 2024 ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌లను హైదరాబాద్, సైదాబాద్‌లోని బిసి స్టడీ సర్కిల్ లో నిర్వహించనున్నట్లు స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1, ఈ నెల 18, 20, 22, 24, 25, 27, 29, 31, జూన్ 1, 3 తేదీల్లో గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తుండగా యూపిఎస్‌పి సివిల్ స ర్వీసెస్ 2024 ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్ ఈ నెల 23, 26, 28, 30, జూన్ 2, 4, 6, 8, 10, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రాండ్ టెస్ట్‌కు హాజరు కావడానికి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను www.tsbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 04024071178, 04027077929 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News