Thursday, January 23, 2025

సివిల్ సర్వీస్ అంటేనే దేశానికి సేవ: ఎన్వీఎస్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

యువ సివిల్ సర్వీస్ ఔత్సాహికులు కృషి, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం,
పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలి
సివిల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండి, ఎన్వీఎస్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  యువ సివిల్ సర్వీస్ ఔత్సాహికులు కృషి, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండి, ఎన్‌విఎస్ రెడ్డి సూచించారు. సివిల్ సర్వీస్ అనేది దేశానికి సేవ చేసే అరుదైన అవకాశమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీస్ డే వేడుకల్లో ఎన్వీఎస్ రెడ్డికి సివిల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందచేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఎన్‌విఎస్ రెడ్డి చేసిన విశేష కృషికి, అంకిత భావంతో చేసిన సేవలకు, ఆవిష్కరణల నిమిత్తంవెంకయ్యనాయుడు ఈ అవార్డును ఎన్వీఎస్ రెడ్డికి అందజేశారు.

Also Read: ప్రేమించలేదని.. యువతిని గదిలో బంధించి వేడి నూనెతో చిత్రహింసలు

ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టును పిపిపి పద్ధతిలో నిర్మించిన సమయంలో అసంఖ్యాకమైన అవరోధాలను, ఆందోళనలను, కోర్టు కేసులు, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్వార్థ ప్రయోజనాలతో గోబెల్స్ ప్రచారం, వివిధ ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం లాంటి ఇబ్బందులను తాను ఎదుర్కొన్నానన్నారు. తన దిష్టిబొమ్మను వివిధ మత సంస్థలు, ప్రాజెక్ట్ ప్రత్యర్థులు చాలాసార్లు దహనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన లక్ష్యాల నుంచి ఎన్నడూ వెనక్కి తగ్గలేదని, అకుంఠిత దీక్షతో అసాధ్యం అన్న ప్రాజెక్ట్‌ను సుసాధ్యం చేయగలిగానని ఆయన వివరించారు. ఇతర అవార్డు గ్రహీతలలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ, సివిల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించిన అకాడమీ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News