Monday, December 23, 2024

రాష్ట్రమంతటా సివిల్‌సప్లైస్ పెట్రోల్ బంకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందుబాటులో ఉంచటమే లక్ష్యంగా రాష్ట్రమంతటా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ కవాడీగూడలో పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను ప్రారంభించారు. తొలి వినియోగదారుడిగా చైర్మన్ రవీందర్ సింగ్ తన వాహనానికి పెట్రోలో పోయించుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33జిల్లాల్లో 33 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని సంస్థ తీసుకున్న నిర్ణయంలో భాగంగా తొలిబంక్‌ను ప్రారంభించామన్నారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా పెంట్రోల్‌బంకులు ప్రారంభించి నాణ్యమైన పెట్రోల్ ,డీజిల్ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News