Tuesday, December 24, 2024

జులై 2న ఠాగూర్ ఆడిటోరియంలో సివిల్స్ విజేతల ముఖాముఖి

- Advertisement -
- Advertisement -

Free training in BC Study Circle for Civils

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్తాధ్వర్యంలో జులై 2న సివిల్ సర్వీసెస్ 2021 విజేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో జులై 2న మధ్యాహ్నం 2 గంటల నుండి ఈ కార్యక్రమం ఉంటుందని బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్రా వెంకటేశం ఒక ప్రకటన లో తెలిపారు. యూపిఎస్‌సి పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులు సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. సివిల్స్ గ్రూప్ 1, 2 రాయాలనుకుంటున్న యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆసక్తి గల యువత 7780359322 నెంబర్‌కు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News