- Advertisement -
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారధ్యపు ధర్మాసనం సోమవారం ఉదయం 9.30 గంటలకే విచారణ ప్రక్రియలను చేపడుతుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శుక్రవారం తెలిపారు. సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం వ్యాజ్యాలపై విచారణలను ఉదయం పదిన్నరకు ప్రారంభిస్తాయి. ఇందుకు భిన్నంగా గంట ముందుగా తాము కోర్టుకు వస్తున్నట్లు, కొన్ని అత్యవసర విషయాల విచారణ చేపట్టనున్నట్లు వివరించారు. స్వలింగ వివాహాలకు సంబంధించిన వ్యాజ్యాలపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆరోజు విచారణ కొనసాగిస్తుంది.
- Advertisement -