Sunday, December 22, 2024

ఉజ్బెకిస్తాన్ సుప్రీంకోర్టు సిజెతో సిజెఐ చంద్రచూడ్ భేటీ

- Advertisement -
- Advertisement -

ఉజ్బెకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బక్తియార్ ఇస్లమోవ్‌తో భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) డివై చంద్రచూడ్ గురువారం తాష్కెంట్‌లో సమావేశమయ్యారు. ఉభయ దేశాల ఉన్నత న్యాయస్థానాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై వీరిరువురూ ఈ ద్వైపాక్షిక సమావేశంలో చర్చించినట్లు ఒక ప్రకటన తెలిపింది. షాంఘై సహకార సమితి(ఎస్‌సిఓ) సభ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొనేందుకు సిజెఐ చంద్రచూడ్ తాష్కెంట్‌లో పర్యటిస్తున్నారు.

అంతర్ ప్రభుత్వ సంస్థ అయిన ఎస్‌సిఓ 2001 జూన్‌లో షాంఘైలో ఏర్పడింది. ప్రాంతీయ భద్రతకు సబంధించిన అంశాలతోపాటు ప్రాంతీయ ఉగ్రవాదం, జాతులవైరం, మత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంపై ఆవిర్భావం నాటి నుంచి సంస్థ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రాంతీయాభివృద్ధి కూడా ఇప్పుడు ఎసిఓ ప్రాధాన్యతాంశాలలో ఒకటిగా మారింది. కాగా..మంగళవారం తాష్కెంట్‌లో భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం వద్ద సిజెఐ చంద్రచూడ్ పుష్పనివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News