Sunday, December 22, 2024

చట్టాలు చేసుకోండి..తీర్పుల జోలికి రావద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యాయస్థానాల తీర్పులలో లోపాలుంటే శాసన వ్యవహరాల లెజిస్లేచర్ విభాగం కొత్తగా చట్టం తీసుకురావచ్చు. అంతేకానీ నేరుగా తీర్పులను కాదనరాదు. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శనివారం తెలిపారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించారు. ఈ సమాజం ఏమనుకుంటుందో అనే భావనలతో న్యాయమూర్తులు పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా వారు స్పందించాల్సి ఉంటుంది. ఇతరత్రా ప్రభావాలకు, ఆలోచనలకు ప్రభావితం కావల్సిన అవసరం లేదు. ఈ నిర్థిష్టతనే లెజిస్లేచర్‌కు , జుడిషియరీకి ఉన్న తేడాను తెలియచేస్తుందన్నారు. లెజిస్లేచరు , జుడిషియరీ పనివిధానాల విషయంలో స్పష్టమైన విభజన రేఖలు ఉన్నాయని అన్నారు. ఏదైనా విషయంలో కోర్టుల తీర్పు వెలువడి ఉన్నట్లు అయితే , లెజిస్లేచర్ వ్యవస్థ దీనిపై ఏమి చేయరాదు.

అయితే ఏదైనా మార్పు కోరుకుంటున్నట్లు అయితే లెజిస్లేచర్‌లో భాగమైన అధికారిక ప్రభుత్వ యంత్రాంగం లోపాలను సరిదిద్దాలనే ఆలోచనలో ఉంటే కొత్త చట్టాన్ని తీసుకువచ్చే అధికారాన్ని సంతరించుకుని ఉందన్నారు. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జుడిషియరీ కార్యాచరణలో లెజిస్లేచర్ ప్రత్యక్ష జోక్యం లేదా తీర్పులు తప్పుపట్టే విధంగా స్పందించరాదన్నారు. కోర్టులు వెలువరించే రూలింగ్‌లకు లెజిస్లేచర్ల ఓవర్‌రూలింగ్ కుదరని పని అని తేల్చిచెప్పారు. కేసుల విచారణ, తీర్పుల ప్రక్రియల దశల్లో న్యాయమూర్తులు స్వేచ్ఛను రాజ్యాంగం ఖరారు చేసింది. వారు రాజ్యాంగ నైతికతకుబద్థులు కావల్సి ఉంటుంది. అంతేకానీ ప్రజల ఆలోచనా విధానాలను, ప్రజానైతికతను పట్టించుకోవల్సిన అవసరం లేదని, ఇదే చట్టాలకు న్యాయానికి సంబంధించిన అత్యంత కీలక విషయం అవుతుందన్నారు. ఈ ఏడాది ఇప్పటికీ 72000 కేసుల విచారణ పూర్తి పరిష్కారం జరిగిందని, ఏడాది పూర్తికి మరో నెల గడువు ఉందని, ఈ లెక్కలో పరిష్కృత వ్యాజ్యాల సంఖ్య పెరుగుతుందని వివరించారు.

జుడిషియల్ వ్యవస్థలో ప్రవేశానికి కొన్ని నిర్థిష్టమైన నిర్మాణపరమైన అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. ఇది కేవలం ప్రవేశ స్థాయి పరిణామం అని. ఇది దాటుకుని వస్తే మహిళలు కూడా ఎక్కువగా న్యాయవృత్తిలో చేరవచ్చు. రాణించవచ్చు అన్నారు. అయితే ఇందుకు అవసరం అయిన అవకాశాలను సమాజం కల్పించాల్సి ఉంటుందన్నారు.
భారత క్రికెట్ టీం అదుర్స్
సమ్మిట్‌లో సిజెఐ మెచ్చుకోలు
భారత ప్రధాన న్యాయమూర్తి తమ ప్రసంగంలో ప్రత్యేకించి ఇప్పటి వరల్డ్ క్రికెట్ కప్ గురించి ప్రస్తావించారు. ఇప్పటివరకూ భారతీయ క్రికెట్ టీం అపజయం లేకుండా ముందుకు సాగుతోంది. ఇది టీం పనితీరుకు ఉదాహరణ అని కొనియాడరు. క్రికెట్ టీంకు తన శుభాకాంక్షలు తెలిపారు. వారు ముందుకు దూసుకువెళ్లుతున్నారు. ఇది తనకు స్ఫూర్తిదాయకం అయిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News