Monday, December 23, 2024

అంబేద్కర్ విలువల కోసం శ్రమించాలి : సిజెఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అంబేద్కర్ విలువల కోసం మనం నిత్యం శ్రమించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం చంద్రచూడ్, ఇతర జడ్జీలు నివాళులు అర్పించారు. సుప్రీం కోర్టుకు ఇది చారిత్రక దినమని ఎందుకంటే డిసెంబర్ 6 చారిత్రాత్మకమైనదని, సుప్రీం కోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా చరిత్రలో మనం పాలుపంచుకుంటున్నామని చంద్రచూడ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళి అర్పించడం ద్వారా మనకు మనం గౌరవించుకుంటున్నామని వివరించారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీం కోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News