Saturday, December 21, 2024

సుప్రీంను తారీఖ్ పే తారీఖ్ తంతు చేయవద్దు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తారీఖ్ పే తారీఖ్ తరహాలో వాయిదాలపర్వం వేదిక కానివ్వరాదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లాయర్ల ధోరణిపై మండిపడుతూ చురకలు పెట్టారు. విచారణల స్థాయిల్లో వాయిదాలు కోరవద్దని ఆయన లాయర్లకు సూచించారు. వ్యాజ్యాలు తరచూ వాయిదా పడుతూ పోతూ ఉంటే చివరకు ఇది న్యాయస్థానాల పట్ల పౌరుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. దైనందిన విచారణ ప్రక్రియ ఆరంభానికి ముందు చీఫ్ జస్టిస్ ఈ సాగదీతలు సరికావని తెలిపారు.

సెప్టెంబర్ అక్టోబర్ మధ్య రెండునెలల్లో లాయర్లు దాదాపు 3688 కేసులలో వాయిదాలు కోరారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. చివరకు న్యాయస్థానాన్ని వాయిదాల స్థానం చేయదల్చుకున్నారా? ఇది కుదరదు, కుదరనిచ్చేది లేదన్నారు. ఓ వైపు వేగవంతంగా కేసులు విచారణ జాబితాల్లోకి వస్తున్నాయి. ఇదే రీతిలో వాయిదాలు కూడా పడుతున్నాయి. దీని వల్ల చివరకు దక్కేదేమిటని ప్రశ్నించారు. దామిని అనే హిందీ సినిమాలో హీరో సన్నీడియోల్ తరచూ కోర్టుల్లో విచారణల వాయిదాలపై మండిపడుతూ ఈ తారీఖ్ పే తారీఖ్ డైలాగ్‌కు దిగుతారు. చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఈ డైలాగే వాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News